"పంచ కావ్యాలలో జన జీవన పరిశీలన" అనే నా పరిశోధనాంశం 2000వ సంవత్సరంలో ప్రచురించాను
.
.
ఈ సిద్ధాంతవ్యాసంలో
పంచకావ్యాలని పేర్కొన్నా ఇందులోముఖ్యంగా ఆముక్తమాల్యదపైనే ఎక్కువగా
దృష్టిపెట్టడమైనది.కారణమేమనగా ఈకావ్యంలోనే ఎక్కువగా జనజీవన పరిశీలనకు ఆస్కారమున్నది.కవులు
సాధారణంగా తమను పోషించే కృతిభర్తల అభీష్టానుసారమే,తమ యిష్టాయిష్టాలతో పనిలేకుండా
రచన సాగించడం ఆనాటి పరిస్థితి.కాని రాయలు అలా కాకుండా ఎవరి మెప్పుకోసమో కాకుండా
తనకు నచ్చిన రీతిలో రచన సాగించాడు.