Friday, 17 February 2017

Autography



జ్ఞాపకాలు
ఎప్పట్నుంచో నాజీవితచరిత్ర వ్రాయాలని ఆశ.కాని అంత అవసరమా?అని అంతరాత్మ వెటకారం. కనీసం ముందుతరాలకు చరిత్రయినా తెలుస్తుంది కదా! అనిపించి వ్రాసేద్దామనుకొన్నా.20-12-1950 రికార్డుల ప్రకారం నాపుట్టిన తేదీ.బహుశా!దీనికంటే రెండేళ్ళయినా వెనుక పుట్టివుంటానని మాపెద్దల అందాజు లెక్క.అప్పటి మా రాయలసీమ కఱవు పరిస్థితులు తలచుకొంటేనే కంపరం పుడుతుంది.అనంతపురం జిల్లా,పెనుకొండ తాలూకా,మైలసముద్రం జన్మస్థలం.మాది సూర్యవంశ క్షత్రియ కుటుంబం.మా తాత గారిది” తరిమెల”సంస్థానమట.ఆ సంస్థానం అధీనంలో 56 గ్రామాలుండేవట.కాని అక్కడి భూములు సారవంతమైనవి కాకపోవడం,నీటిసౌకర్యం లేకపోవడం,పైగా ఆప్రాంతంలో నీలం సంజీవరెడ్డి,తరిమెల నాగిరెడ్డి లాంటి రాజకీయ ప్రముఖుల ముందు తలదించుకోలేక, ప్రస్తుత ప్రాంతానికి తరలి వచ్చారట.ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో చిన్న ఉద్యోగం చేస్తూ మైలసముద్రానికి దగ్గర్లో వున్న ఒక విశాలమైన శ్రోత్రియభూమిని కొని తన ఆరుమంది కుమారులు,ముగ్గురు కూతుర్లతో, బంధువులందరికి దూరంగా నివసించసాగాడు. ఊర్లోని కమ్మ,కాపు మొదలైన మధ్యతరగతి కుటుంబాలతో బంధువులకు మల్లే వరసలతో సంభాషించుకొంటూ వారితో మమేకమై మనుగడ సాగిం చారు.అందుకే మాలో చాలామందికి మా కులాచారాలు,పద్ధతులు తెలిసేవి కాదు.బాల్యంలో మాకు తెలిసిన మాబంధువులున్న ఒకేఒక వూరు ధర్మపురి(ధర్మవరం దగ్గర్లోది)మాత్రమే!
తరిమెల నుండి అన్నీ వదలుకొని వచ్చేశారు.కోటను,ఆస్తిపాస్తుల్ని,చివరకు కులదేవతయైన చౌడేశ్వరిని తృణీకరించి వచ్చేశారు.రాగి ఫలకలపైన చెక్కిన కోటకు సంబంధించిన ఫర్మానాలు,ఆయుధ పూజకని కత్తి డాలు లాంటి కొన్ని పరిమిత ఆయుధాలు మాత్రం తీసుకొని వచ్చారు.తెచ్చిన ఆకొద్ది వాటినైనా జాగ్రత్తపరచుకోలేకపోయారు.పూర్తీగా రైతులుగా మారిపోయి,లౌకికమైన కనీస జ్ఞానాన్ని కోల్పోయారు.ఎంతో చారిత్రిక ప్రాధాన్యత కలిగిన  ఆరాగి ఫలకల్ని కరిగించి బిందెలు తపేలాలు చెంబులు చేయించుకొన్నారట.కత్తులు డాళ్ళు మొదలైన ఆయుధాలను గొడ్డళ్ళు కొడవళ్ళుగా చేయించుకొని అసలైన రైతుల మనిపించుకొన్నారు.గతవైభవాన్ని,సంస్థానాధీశ హోదాను మర్యాదల్ని కోల్పోయి కేవలం కుక్షింభరులుగా బ్రతుకు సాగించారు,’ రాజ్యాంతే నరకమ్ ధ్రువమ్’ అని గదా పెద్దలన్నారు.

Friday, 1 November 2013

ప్రస్తుతం ప్రజ్జ్వలిస్తున్న సమస్య,వేర్పాటు ,సమైక్య సమస్య.లోకోభిన్నరుచి" అన్నట్లు ఎవరెవరి అభిప్రాయలు వేరు వేరుగా ఉండడటం సహజం.కాని గతంలో జరిగిన రాష్ట్రాల వేర్పాట్ల తతంగాలను పరిశీలిస్తే,వేర్పాటును కా 'క్షించే వారే విడిపోయి,తమ రాజధానిని ఏర్పాటు చేసుకోవడమైంది.ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయి తమ రాజధానిని ఏర్పాటు చేసుకొన్నారు.అలాగే గుజరాతీయులు కూడా.ఈవిషయాలను   దృష్టిలో పెట్టుకొని తెలంగాణా సోదరులు కలిసి ఉండడం తమకిష్టం లేకపోతే విడిపోయి తమరాజధానిని తామే ఏర్పాటు చేసుకొని అన్నదమ్ములా మెలగటం ధర్మం,మరియు సర్వామోదం.

ఆధునిక సాహిత్యకారుల మనస్తత్వాలు

ఆధునిక సాహిత్యకారుల మనస్తత్వాలను నిష్పాక్షికంగా పరిశీలించినట్లైతే రెండు విషయాలు స్పష్టంగా బోధపడుతాయి.
1. ప్రభుత్వ పథకాలను పరిశీలించి వాటికనుగుణంగా తమకిష్టమున్నా లేకున్నా తదనుగుణంగా సాహిత్య సృష్టి చేసి,అవార్డులు పొందడం.
2. అవార్డులతో నిమిత్తం లేకుండా, సమాజశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రజలలో చైతన్యం కలిగించే దిశగా రచనలు కొనసాగించటం.
అయితే,సమాజంలో పై రెండో కోవకు చెందిన సాహిత్యాన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేరు. దాంతో సమాజంలో చవకబారు సహిత్యం, అశ్లీల, అసభ్యకర సినిమాలు, దూరదర్శన కార్యక్రమాలు విజృంభిస్తున్నాయి. వాటి ప్రభావంతో వెర్రితలలు వేస్తున్న యువకుల వికృత వికార చేష్టలు సభ్యసమాజానికి తలవంపులు తెస్తున్నాయి.

Thursday, 19 September 2013

ఆముక్తమాల్యద

పంచకావ్యాలలో  నాకు ఆముక్తమాల్యద చాల యిష్ట మైనది. 

Friday, 26 October 2012

Saturday, 15 October 2011

My book: Pancha kavyalalo janajeevana parisheelana

 "పంచ కావ్యాలలో జన జీవన పరిశీలన" అనే నా పరిశోధనాంశం 2000వ సంవత్సరంలో ప్రచురించాను
.

ఈ సిద్ధాంతవ్యాసంలో పంచకావ్యాలని పేర్కొన్నా ఇందులోముఖ్యంగా ఆముక్తమాల్యదపైనే ఎక్కువగా దృష్టిపెట్టడమైనది.కారణమేమనగా ఈకావ్యంలోనే ఎక్కువగా జనజీవన పరిశీలనకు ఆస్కారమున్నది.కవులు సాధారణంగా తమను పోషించే కృతిభర్తల అభీష్టానుసారమే,తమ యిష్టాయిష్టాలతో పనిలేకుండా రచన సాగించడం ఆనాటి పరిస్థితి.కాని రాయలు అలా కాకుండా ఎవరి మెప్పుకోసమో కాకుండా తనకు నచ్చిన రీతిలో రచన సాగించాడు.